ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, May 11, 2012

బ్లాక్ డే ఇప్పుడు గుర్తొచ్చిందా.. సాక్షికి జర్నలిస్టుల శాపం తగిలింది. జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..?


జర్నలిస్టు నాయకులకు.. ఇప్పుడు మెలకువ వచ్చిందా..? బ్లాక్ డే అంటూ సాక్షి పత్రిక పెద్ద అక్షరాలతో ఈ రోజు బేనర్ పెట్టుకుంది. వాస్తవానికి సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు.. కానీ ఈ రాష్ట్ర్రంలో ఉన్న జర్నలిస్టులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే బ్లాక్ లిస్టులో చేరిపోయారు. చిన్న పత్రికలన్నీ చాలా వరకు కూడూ గుడ్డా లేకుండా రోడ్డున పడ్డాయి. రెండు రూపాయలకే చాటెడు చెత్త అందిస్తానని చెప్పుకొచ్చిన సాక్షికి ఈ రోజు బ్లాక్ డే కావచ్చు. కానీ వార్తా పత్రికలేమన్నా. భగవద్గీతలా.. ఖురానా.. బైబిలా వాటి అంత సత్య నిరత ఉందా... ? వార్తా పత్రికల్లో వార్త పడితే స్పందించాలా.. పత్రికలో అధికారుల అలసత్వం పై, అవినీతి పై వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలా...? అంటూ వ్యంగ్య బాణాలు విసిరిన పరమ మీడియా ద్వేషి వైయస్ రాజశేఖర్ రెడ్డి అనే విషయం ప్రతి జర్నలిస్టుకూ తెలుసు. చనిపోయి ఏ లోకంటో ఉన్నాడో గానీ.. బతికున్నపుడు చేసిన నిర్వాకం వల్ల పేద జర్నలిస్టులు చాలా మంది కూటికెల్లక కూలీ పడుతున్నారు. చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా.. వార్తలు రాసీ రాసీ విసుగు పుడుతుందే తప్ప ఏ ఒక్క అధికారిలో కదలిక లేదు. అతగాడి చెత్త వ్యూహం వల్ల రాష్ట్రంలో జవాబుదారీ తనంలోపించింది. అధికారులు అవినీతి పరులయ్యారు. బాహాటంగానే లంచాలు పుచ్చుకుంటున్నారు. ఎవరైనా విలేకరులు వివరణలు అడిగితే.. కావాలంటే ఫోటోలు తీసుకోండని వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. ఎన్ని వార్తలు రాసినా అధికారులు పాత పద్దతిలోనే అంటే.. వార్తలు భగవద్గీతలు కావు కదా అని వైయస్ చెప్పాడని నెట్టుకొస్తున్నారు. సాక్షిలో వస్తేనే వార్త, సాక్షి చానల్‌లో ప్రసారమైందే సిసలైన వార్త.. ఇదీ వైయస్ రాజశేకర్ రెడ్డి సిద్ధాంతం. ఈ సిద్దాంతం వల్ల పత్రికలన్నీ మూసేసుకోవాలనే పన్నాగం పన్ని..రాష్ట్రంలో ఏ పత్రికకూ యాడ్స్ రాకుండా అడ్డుకున్నాడు. చిన్న పత్రికలైతే మరీ బిచ్చగాళ్లలా తిరిగినా.. కాళ్లరిగేలా తిరిగినా ఏ సమాచార అధికారీ ఒక్క యాడ్ ఇచ్చిన పాపాన పోలేదు. ఎవరికైనా కాళ్లొత్తే అలవాటు ఉంటే.. ఒకరిద్దరు బతకనేర్చి యాడ్స్ తెచ్చుకునేవారు. ఆత్మభిమానం ఉన్న వాళ్లంతా డీటీపీ ఆపరేటర్లుగానో.. డెస్ట్ ఎడిటర్లుగానో అవతారం ఎత్తారు. ఎప్పుడైతే సాక్షి తాకిడికి, వైయస్ చెత్త నిర్ణయాలకు పత్రికలు, జర్నలిస్టులు బలయ్యారో.. ఆ రోజే జర్నలిజానికి బ్లాక్ డే మొదలయింది.
ఈ రోజు సాక్షి పత్రికకు ఒక్కరోజు యాడ్స్ నిలిపేస్తే గొంతు చించుకుంటున్న సో కాల్డ్ జర్నలిస్టులు.. ఇంతకాలం ఇన్ని పత్రికల గోస తెలియదా... అమర్ లాంటి వ్యక్తి ఈ రోజు మీడియా ముండు నిలబడి అప్రజాస్వామికమని గొంతు చించుకుంటున్నాడే.. ఏపీ‍యూడబ్ల్యూజే అధ్యక్షుడయి కూడా ఏనాడన్నా చిన్న పత్రికల గోడు పట్టించుకున్నాడా.. తనకు లక్షలాధి రూపాయల జీతం ఇచ్చి... యాంకర్ గా ప్రసెంట్ చేసిన సాక్షి ఖాతాలు ఆగిపోగానే..యాడ్స్ ఆగిపోగానే..తన జీతం ఎక్కడ ఆగుతుందో అనో.. లేక జగన్ మెహర్‌బానీ కోసమో..జర్నలిస్టు విలువలు, పత్రికా స్వేచ్ఛ గుర్తొచ్చాయి. కలర్ పేపర్ మాయలో కనుమరుగయిపోయిన కరకు పత్రికల సాక్షిగా... జర్నలిస్టులు కన్నీళ్ల సాక్షిగా... ఎన్నో కుటుంబాల గోస తగిలి ఈ సాక్షి నాశనం కాక తప్పదు. పాలనా వ్యవస్థను పాడు చేసిన వ్యక్తికి పేదవారి శాపం తగలక మానదు. ఓ సోకాల్డ్ జర్నలిస్ట్ మేతావుల్లారా.. ఒక సాక్షికి యాడ్స్ ఆపినపుడు కాదు.. చిన్నపత్రికలు యాడ్స్, అక్రిడేషన్లు ఆపినపుడు కూడా మీ నోరు తెరవండి.. లేకుంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

16 comments:

  1. ఇది నా మొదటి పోస్ట్ / రిప్లై కాబట్టి అంత క్లెఆర్‌గా ఉండకపోవచ్చు.
    మీ ఆలోచనలో చిన్న పత్రిక అంటే, ఈనాడు, ఆంధ్ర జ్యోతినా?
    నాకు బాగా గుర్తు. ఆ రెండు బాబు బాజాన చేసుకుంటూ, బాబు వార్తలు తప్ప ఇంకేం ప్రచురించని కాలంలో, సాక్షి వొచ్చింది. అప్పటినుంచే మాలాంటి కామన్ పీపుల్కి ఇంకో పర్సం అర్ధంతెలిసింది. అలాగని నేనేం సాక్షిని వెనకేసుకొని రావడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆది వొచ్చాక అన్ని మీడియల్లోనూ అందరి జీతాలు పెరగడం నిజం కాదా? పేపర్ హాకర్లు అప్పటినుంచే వాళ్ళ కష్టానికి తగ్గ జీతం తీసుకోవట్లేదా? అసలు రోడ్డున పడ్డారు అన్నారు కదా, ఆది మీ అభిప్రాయామా లేక ఆధారాల్తో మాట్లాడారా?

    నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా సీ బీ ఐ మమ్మల్ని అంటే నన్ను అనికూడా అనుకోండీ కన్విన్స్ చెయ్యగలిగిన ఆధారాలు ఎం చూపలేదు. పోనీ మీరేం చూసారో చెప్పండి . రాళ్లు మన కు ఫ్రీగా దొరుకుతున్నాయని విసారకండి. కాస్త ఆధారాలు చూపడం నేర్చుకోండి.

    ReplyDelete
  2. మీరు రాసింది నిజం. వైఎస్ బతికున్నప్పుడు సాక్షిలో పేజీలకు పేజీలు ప్రభుత్వ ప్రకటనలు కనిపించేవి. మిగతా ఏ పత్రికలోనూ అన్ని యాడ్స్ ఉండేవి కావు.

    ReplyDelete
  3. 100% correct.....recollect the incident where he said......I need not respond to the news in your paper..if you want you can file a complaint in court ...to AJ ...you rock...you look like gababar singh

    ReplyDelete
  4. Amar is no one dash....he got the press council chairmanship from his reddy devudu.....since those days his crook attitude qualifies him to be in YSRCP

    ReplyDelete
  5. చాలా ధైర్యంగా రాసారు. 'మీ నాయకుడు దోపిడీకి పాల్పడ్డాడుకదా'.. అని ఎవరైనా అంటే 'ఆ విషయం చట్టం తేల్చలేదుకదా' అంటారు. చట్టం ఏదైనా పనిచేస్తే దానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ గగ్గోలుపెడతారు.. గతకొద్దిరోజులుగా వారి మాటలు, చేతలు ఇలాగే వున్నాయి.

    ReplyDelete
  6. >> నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా సీ బీ ఐ మమ్మల్ని అంటే నన్ను అనికూడా అనుకోండీ కన్విన్స్ చెయ్యగలిగిన ఆధారాలు ఎం చూపలేదు.

    Who the heck are you to get convinced? Do the investigation bureau has to reveal its day to day operations and case proceedings to the public so that criminals will make safe arrangements? The matter is in the court and so far, in these cases (Jagan, gali, emaar) whatever the actions they took are mostly approved by court.

    ReplyDelete
  7. చంద్రబాబు మంచి పనిమంతుడు. గొప్ప రాజకీయ క్రీడాకారుడు కూడా! పొలిటికల్ కారమ్ బోర్డు మీద స్ట్రైకరును ఎటుతిప్పికొడితే ఎటో ఉన్న రెడ్డో, దాని వెనుక బడ్డో ఎలా పాకెట్లో పడతాయో ఆయనకు భలేగా తెలుసు. పైగా బాబు పంచతంత్రంలోని దీర్ఘదర్శికి చదువు చెప్పగలిగినవాడు. ఇప్పటి తన పగవాడి డాడీలాగే నాయుడు కూడా చాలా ఏళ్లు రాజ్యమేలాడు. అనే్నళ్లూ ‘ఆ రెండు పత్రికలు’, ‘ఈ మూడు ముఠాలు’ అంటూ డైలాగులు కొడుతూ కూచోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలిసీతో ఏ క్షేత్రానికా క్షేత్రంలో పనికొచ్చే విత్తనాలను చల్లాడు. అవే ఇప్పుడు విరగపండి ఏ రంగానికారంగంలో అవసరానికి ఆదుకుంటున్నాయి.
    సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
    పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్‌పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి. తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
    భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
    మీరు ఫలానా కేసులో ఎగస్పార్టీకి మేలు చేశారు. కాబట్టి ఈ కేసులోనూ మాకు కీడే చేస్తారు. మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు కేసు తీసుకోకండి - అంటూ ఆ బాలుడు అడ్డదిడ్డంగా వాదిస్తూ తీరికూర్చుని జడ్జిలకు ఒళ్లు మండిస్తూంటే - ఈ గోపాలుడు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరిన బాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.

    ReplyDelete
  8. please give examples of some smaller papers about which you mentioned in this article, then only this will complete..

    bachi

    ReplyDelete
  9. అంటే జర్నలిస్టులకు జీతాలు పెరగడానికి కారకుడైన వ్యక్తి రాష్ట్రాన్ని,దేశాన్ని దోచుకున్నా, ఎన్ని మర్డర్లు మానభంగాలు చేయించినా, ఎన్ని చట్టాలను ఉల్లంఘించినా......రాష్ట్ర జనభాలలో పాయింట్ పర్సంట్ కూడా లేని జర్నలిస్టులు( ఇందులో మళ్లీ చాలామంది బతక నేర్చిన వాళ్లు మళ్లీ వేరే )సదరు మహాత్ముడిని ఏమీ అనవద్దన్న మాట. అంటే జగన్ వేల కోట్ల రూపాయలను దోచుకున్నా...జర్నలిస్టుల జీతాలు పెంచినందుకు అతడికి ఓ మహాత్మా ఓ మహర్షీ అంటు వదలివేయాలన్న మాట. బాగు బాగు....

    ReplyDelete
    Replies
    1. నిజమే యదార్థవాది గారు, సమాజం అంటే ఒక కులంవాళ్ళో, ఒక మతంవాళ్ళో, ఒక ప్రొఫెషన్‌వాళ్ళో కాదు కదా. కుల రాజకీయాలు & మత రాజకీయాలు నడిపేవాళ్ళైతే మెజారిటీ పేరు చెప్పుకుంటారు. కానీ విలేఖరి వృత్తికి సంఖ్యాపరమైన మెజారిటీ ఎక్కడ ఉంది?

      Delete
  10. Freezing of properties should have been done only after proper evidence shown to court and taking court approval....

    So far, CBI hasn't made any progress regarding the legality of 26 GOs, which is the central point of this case.

    ReplyDelete
  11. well said & let the law take it's own course!

    ReplyDelete
  12. Writing is an art, you have written it really well but it is very far from the truth.

    ReplyDelete
  13. ఆధారాలు ఎం చూపలేదు...

    ఇదొకటి బాగా నేర్చారు...ఓ ప్రక్క కుప్ప తెప్పలుగా స్టేట్మెంట్లూ,డాక్యుమెంట్లూ...కేటాయింపుల తాలూకు సంతకాలూ కనబడుతూంటె??సాక్ష్యం అంటే సూట్ కేసులతో డబ్బు జగన్ చేతుల్లో పెట్టడడమా??అలా అయితే సాక్ష్యాలు లేనట్లే లెండి!!ఏదీ మీకో పదిహేను వేల ఎకరాలు కేటాయించుకోండి గవర్నమెంట్ నుండి...చూద్దాం..ఏ దేముడు మీకు ఉత్తనే కేటాయిస్తాడో..ఈ రాష్ట్రం లొ..

    ReplyDelete
  14. @యధార్ధవాది......అదీ పాయింట్..అందరూ అడుగు తున్నదీ అదే...బాబు ఎలానూ తప్పించుకున్నాడు కదా అని దొరికిన ఈ దొంగనీ రకరకాల చర్చలు పెట్టి ఏమార్చొద్దూ అంటున్నామ్...ఎంత దైర్యమండీ??ఎంత నమ్మకమండీ జనాలు గొర్రెలనీ??ఇంత దోచుకునీ జనాల్లో తిరగడానికి??

    ReplyDelete